Reading Time: < 1 minute
India Beat West Indies Sanju Samson 97 Gautam Gambhir Press Meet Reaction

Gautam Gambhir: నిన్న జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విజయ కేతనం ఎగురవేసింది. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు సంజూ శామ్సన్ వెస్టిండీస్ ప్లేయర్స్‌కు చుక్కలు చూయించాడు. 50 బంతుల్లో ఏకంగా 97 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. అయితే.. మ్యాచ్ తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు పస్తుతం వైరల్‌గా మారాయి. ప్రెస్ మీట్‌లో చెప్పిన మాటలు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. చిన్న చిన్న కాంట్రిబ్యూషన్‌లను సైతం గుర్తించడంపై సంతోషం వ్యక్తం చేసిన గంభీర్, చాలా కాలంగా క్రెడిట్ కొద్ది మందికే పరిమితమైందని సూచించారు. విమర్శకులకు ఇచ్చి పారేశాడు.

READ MORE: Sanju Samson Record: సంజు శాంసన్‌ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!

టోర్నమెంట్ ఆరంభంలో సంజూను జట్టులోంచి తప్పించాలని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఫామ్‌లో లేడని అందరూ భావించారు. తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై గంభీర్ వివరణ ఇస్తూ.. ఎంతో ఆలోచించి సంజూను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపారు. “సంజూలో ఎంత సామర్థ్యం ఉందో మాకు తెలుసు. అతని ఖాతాలో మూడు టీ20 సెంచరీలు ఉన్నాయి. ప్రతి ఆటగాడికి చెడు దశ వస్తుంది. అప్పుడప్పుడు ఒత్తిడినుంచి బయటకు తీసుకురావడం అవసరం.” అని గంభీర్ వివరించారు. అవసరమైన సమయంలో అతను ప్రపంచకప్‌లో ప్రభావం చూపుతాడనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆంకెల కంటే అనుభవానికే ఎక్కువ విలువ ఇస్తానని గంభీర్ చెప్పడం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మరో హైలైట్‌గా మారింది. “టీ20 అనేది గణాంకాల ఆట కాదు. అది అర్థం చేసుకునే ఆట, ఆత్మవిశ్వాసం ఉన్న ఆట. నా అనుభవాన్ని కెప్టెన్‌తో పంచుకుంటాను. చివరి నిర్ణయం మాత్రం కెప్టెన్‌దే.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: PCB Fines Pakistan Players: అబ్బా ఏం ఫీల్ ఉంది.. పాక్ ప్లేయర్లకు PCB షాక్ ట్రీట్మెంట్.. ప్రతి ఆటగాడికి 50 లక్షల జరిమానా!