Reading Time: < 1 minute
Mukesh Ambani And Anant Ambani Big Announcement Reliance Industries To Invest 110 Billion Dollars In Ai Data Centers Renewable Energy

Reliance Industries: భారత వాణిజ్య రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) భారీ ప్లాన్ కు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడు సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, డిజిటల్ ఎకోసిస్టమ్, ఎనర్జీ రంగాల్లో ఏకంగా 110 బిలియన్ డాలర్లు (రూ.10 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు విషయాన్నీ రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేష్ అంబానీ ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌ లో ప్రకటించారు.

55dB ANC, 54 గంటల బ్యాటరీ, సూపర్ ఫీచర్లతో Oppo Enco Air 5 Pro లాంచ్..!

గతంలో టెలికాం, ఇంటర్నెట్ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రిలయన్స్.. ఇప్పుడు AI రంగంలో కూడా అదే స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ పెట్టుబడి 2014 నుంచి 2021 మధ్య టెలికాం, డిజిటల్ రంగాల్లో చేసిన పెట్టుబడులకు సమానంగా ఉంటుంది. ఈ పెట్టుబడుల ద్వారా AI సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది రిలయన్స్.

Vastu Mistakes at Home: వాస్తు చిట్కాలు.. ఈ చిన్న తప్పులే.. మీ ఇంట్లో పెద్ద సమస్యగా మారవచ్చు..!

ఈ భారీ పెట్టుబడిలో భాగంగా మల్టీ-గిగావాట్ డేటా సెంటర్లు, 10 గిగావాట్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, AI చిప్ అభివృద్ధి వంటి ప్రాజెక్టులు అమలు చేయనున్నారు. ఇప్పటికే 1 గిగావాట్ సామర్థ్యంతో AI హుక్ అప్ నిర్మాణం ప్రారంభమైందని సమాచారం. FY26 రెండో భాగంలో 120 మెగావాట్ సామర్థ్యంతో మొదటి దశ ప్రాజెక్టులు ప్రారంభం కావచ్చు. AI రంగంలో విస్తరణ కోసం రిలయన్స్ భాగస్వామ్య విధానాన్ని అనుసరించనుంది. ప్రపంచ టెక్ దిగ్గజాలైన ‘మెటా’, ‘గూగుల్’ వంటి సంస్థలతో భాగస్వామ్యం ద్వారా పెట్టుబడి భారం తగ్గించుకోవడంతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది.