Reading Time: < 1 minute

మాజీ మంత్రి వెంకట్ రెడ్డి లేని లోటు తీర్చలేనిది: సీఎం రేవంత్

Caption of Image.

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు గాదె వెంకట్ రెడ్డి మృతి పట్ల  సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఐదుసార్లు ప్రాతినిథ్యం వహించిన వెంకట్ రెడ్డి .. మంత్రిగా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తుచేసుకున్నారు.

సౌమ్యుడు, సహనశీలిగా పేరుగాంచిన వెంకట్ రెడ్డి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొంటూ, గాదె వెంకట్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

మాజీ మంత్రి వెంకట్ రెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా వయోభారం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన శుక్రవారం (మే 29) హైదరాబాద్‎లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. వెంకటరెడ్డి మృతిని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. వెంకటరెడ్డి మరణంపై పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

 
 

©️ VIL Media Pvt Ltd.