Reading Time: < 1 minute
Tmc Crisis Sukhendu Sekhar Roy Resigns Mamata Banerjee Trouble

Mamata Banerjee: మమతా బెనర్జీ ఇండియా కూటమి కీలక సమావేశంలో పాల్గొన్న సమయంలోనే, తృణమూల్ ఎంపీలు తిరుగుబాటు చేసి, బెంగాల్ సీఎం సువేందు అధికారితో భేటీ అయినట్లు తెలుస్తోంది. 14 మంది టీఎంసీ బీజేపీ నాయకుడు భూపేంద్ర యాదవ్ ఇంటిలో సమావేశమయ్యారు. 14 మంది లోక్‌సభ ఎంపీలు ఈ బీజేపీతో టచ్‌లోకి వెళ్లడం మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇప్పటికే, టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది ఇప్పటికే రీటబ్రత బెనర్జీ క్యాంపులో ఉన్నారు. మమతా బెనర్జీని ధిక్కరించి వ్యవహరిస్తున్నారు.

సోమవారం ఢిల్లీకి సువేందు అధికారి వచ్చారు. మరోవైపు, ఢిల్లీలోనే ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మమతా బెనర్జీ హాజరయ్యారు. ఈ క్రమంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సర్వత్రా ఆసక్తిని పెంచుతున్నాయి. 14 మంది ఎంపీలతో జరుగుతున్న సమావేశంలో సువేందుతో పాటు భూపేంద్ర యాదవ్, త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ దేబ్ కూడా ఉన్నారు.

దీనికి ముందు, సోమవారం ఉదయం ఐదుగురు తృణమూల్ ఎంపీలు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఇంట్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత బెంగాల్ సీఎం సువేందు కూడా ఆయన నివాసానికి వెళ్లారు. మరోవైపు, టీఎంసీ రాజ్యసభ ఎంపీ, చీఫ్ విప్‌గా ఉన్న సుఖేందు శేఖర్ రాయ్ తన ఎంపీ పదవితో పాటు, టీఎంసీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. సీనియర్ టీఎంసీ నేత రాజీనామా చేయడం మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. టీఎంసీకి చెందిన 29 లోక్‌సభ ఎంపీల్లో 14 మంది బీజేపీ వైపు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. టీఎంసీకి 13 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయడంతో మరికొందరు కూడా ఆయన బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, టీఎంసీకి రాజీనామా చేసిన సుఖేందు శేఖర్‌ను ఢిల్లీలో ఐదుగురు టీఎంసీ ఎంపీలు కలిశారు. ఈ సమావేశంలో బుర్ద్వాన్ ఈస్ట్ ఎంపీ షర్మిలా సర్కార్, హౌరా ఎంపీ ప్రసూన్ బెనర్జీ, కూచ్ బెహార్ ఎంపీ జగదీష్ బసునియా, ఝార్గ్రామ్ ఎంపీ కాళిపద్ సోరెన్, బంకురా ఎంపీ అరూప్ చక్రవర్తి పాల్గొన్నారు.