Reading Time: < 1 minute

ఖమేనీ మృతితో మసీదుపై ఎర్ర జెండా ఎగరేసిన ఇరాన్.. దీని అర్థమేంటో తెలుసా ?

Caption of Image.

అగ్రనేత ఖమేనీ మృతితో ఇరాన్ తోకతొక్కిన తాచులా బుసలు కొడుతోంది. అమెరికా దళాలకు ఆశ్రయం ఇచ్చిన పొరుగు దేశాలపై విరుచుకుపడుతోంది. దుబాయి, కువైట్, ఇజ్రాయెల్.. తదితర దాదాపు 8 దేశాలపైన దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఖమేనీ మృతితో మసీదుపై ఎర్ర జెండాను ఎగరేశారు. 

మసీదుపై రెడ్ ఫ్లాగ్ ఎగరవేయటంతో.. దీని మీనింగ్ ఏంటనే డౌట్ చాలా మందిలో నెలకొంది. ఇరాన్ లోని జంకరన్ మసీదుపై రెడ్ ఫ్లాగ్ ను ఎగరరేసింది ఇరాన్. ఈ జెండాను ప్రతీకార జెండా అంటుంటారు. తమ అధినేత మృతికి ప్రతీకారం తీర్చుకుంటాం.. న్యాయం చేస్తాం.. అనే అర్థంలో ఎరుపు రంగులో ఉండే జెండాను ఎగరేస్తారు. 

మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. క్వోం సిటీలోని మసీదుపై ప్రతీకార జెండా ఎగరరేసినట్లు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తలు పెరుగుతున్న కొలదీ.. ఖమేనీ మద్ధతు దారులు ఏదో ఒక రూపంలో నిరసనలకు దిగుతున్నారు. 

ఇరాన్‎పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ సోషల్ ట్రూత్‎లో సంచలన ప్రకటన చేశారు.

►ALSO READ | ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ గా అలీరెజా అరాఫీ 

చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకరైన ఖమేనీ చనిపోయాడు. మా ఇంటెలిజెన్స్, అత్యంత అధునాతన ట్రాకింగ్ వ్యవస్థలను అతడు తప్పించుకోలేకపోయాడు. ఈ చావుతో ఇరాన్, అమెరికా, బాధిత దేశాలకు న్యాయం జరిగింది. ఖమేనీతో పాటు ఇతర ఇరాన్ అగ్ర నాయకులు కూడా హతమయ్యారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం.. అని అని ట్రంప్ పేర్కొన్నారు.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్, భద్రతా దళాలు యుద్ధం చేయడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. ఖమేనీ, ఇరాన్ అగ్ర నాయకులు హతమైనప్పటికీ మరో వారం రోజులు దాడులు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ కూడా ఖమేనీ మరణవార్తను ధృవీకరించింది. 

©️ VIL Media Pvt Ltd.