Reading Time: < 1 minute
Akhil Akkineni Guest Role In Ntr Dragon Movie Rumors Clarity

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా అక్కినేని యువ హీరో అఖిల్ (Akhil Akkineni) ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా వైరల్ అయ్యింది. అయితే, ఈ క్రేజీ బజ్ పై తాజాగా ఒక స్పష్టత వచ్చింది.

Also Read : Taapsee Pannu: ట్రోల్స్ దెబ్బకి తాప్సి యూటర్న్?

ప్రశాంత్ నీల్ అఖిల్ మధ్య ఉన్న స్నేహం కారణంగానే ఈ ప్రచారం మొదలైనట్లు తెలుస్తోంది. కానీ, చిత్ర యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘డ్రాగన్’ కథలో అఖిల్ పాత్ర ఏదీ లేదని స్పష్టమైంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తన పూర్తి దృష్టిని ఎన్టీఆర్ పాత్రను ఎలివేట్ చేయడంపైనే పెట్టారు. ఇటీవల జోర్డాన్‌లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి నాటికి పూర్తి చేసి, భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటు అఖిల కూడా తన ‘లెనిన్’ (LENIN) చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఈ ఏడాది జూన్ నెలలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి, అఖిల్ ప్రస్తుతం తన సొంత ప్రాజెక్టుపైనే ఫోకస్ పెట్టారు. అఖిల్,ఎన్టీఆర్ కాంబో కోసం ఎదురుచూసిన అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే వార్తే అయినప్పటికీ, ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ ఇచ్చే ఊరమాస్ ట్రీట్ కోసం నందమూరి అభిమానులు వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు.