Reading Time: < 1 minute

నాకు మెట్టినిల్లు గుంజేడు ముసలమ్మ తల్లి.. మేడారంలా గుంజేడును అభివృద్ధి చేస్తాం: మంత్రి సీతక్క

Caption of Image.

మేడారంలా గుంజేడు ముసలమ్మ తల్లి జాతరను అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు.  మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ తల్లి ఆలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజాలు.మార్చి 4 నుంచి 6 వరకు గుంజేడు ముసలమ్మ తల్లి జాతర జరగనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. 

ఆదివాసి గిరిజన సంప్రదాయ పద్ధతిలో మంత్రి సీతక్క కు ఘన స్వాగతం పలికిన పూజారులు, ఆదివాసి గిరిజనులు. 50 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీతక్క . ఈ  సందర్భంగా గుంజేడు ముసలమ్మ తల్లి 14 మంది కమిటి సభ్యులను  సన్మానించారు. 

ఈ  సందర్బంగా మాట్లాడిన సీతక్క.. మూడు రోజుల పాటు జరిగే   గుంజేడు ముసలమ్మ జాతరకు లక్షల మంది భక్తుల వస్తారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్ల చేయాలి. నాకు పుట్టినిల్లు సమ్మక్క_సారలమ్మ తల్లలు..మెట్టినిల్లు గుంజేడు ముసలమ్మ తల్లి.మేడారం జాతరను ఎలా సక్సెస్ చేశామే ..ఆలాగనే గుంజేడు ముసలమ్మ తల్లి జాతరను కూడ అలా చేస్తా.ములుగు జిల్లాకు గత 10 సంవత్సరాల చుక్క నీరు ఇవ్వని బీఆర్ఎస్ మంత్రులు ఇప్పుడు మా ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదు . ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ఆభివృధ్ధిపదంలో ముందుకు సాగుతుంది..సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేడారం సమ్మక్కసారలమ్మ కోట్ల రూపాయలతో  ఆభివృధ్ధి చేశాం .ఇప్పుడు గుంజేడుముసలమ్మ తల్లి జాతను కూడ ఆలానే అభివృధ్ధి  చేస్తాం అని అన్నారు.

©️ VIL Media Pvt Ltd.