Reading Time: < 1 minute
Union Home Minister Amit Shah Visit To Bihar

చొరబాటుదారుల నుంచి విముక్తి అంటే కేవలం ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించడమే కాదని.. భారత నేల నుంచి ప్రతి ఒక్క చొరబాటుదారుడిని తొలగించే కార్యక్రమాన్ని అమలు చేయాలని కేంద్రం నిశ్చయించుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీహార్‌లోనే సీమాంచల్ ప్రాంతంలో అమిత్ షా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో సీమాంచల్ నుంచే చొరబాటుదారులను ఏరివేస్తామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Supreme court vs NCERT: న్యాయవ్యవస్థపై తప్పుడు ముద్ర వేసి విచారమా? ఎన్‌సీఈఆర్టీపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం

‘‘ఈ రోజు భారత విప్లవకారుడు వీర్ సావర్కర్ వర్ధంతి. వీర్ సావర్కర్ స్వాతంత్ర్య పోరాటంలో అసమాన యోధుడు మాత్రమే కాదు. అపారమైన శక్తిని ప్రదర్శించిన నిర్భయ దేశభక్తుడు కూడా. తన సాహిత్యం ద్వారా దేశవ్యాప్తంగా దేశభక్తిని రగిలించారు. ప్రాథమిక సూత్రాలను ప్రతిబింబించే నాయకుడు… అంటరానితనాన్ని నిర్మూలించినా, భాషల శుద్ధి చేసినా, స్వచ్ఛమైన జాతీయవాద దృక్పథమైనా.. వీర్ సావర్కరే వీటన్నింటికీ అపారమైన కృషి చేశారు. తన మరణం వరకు అలాగే కొనసాగారు. ఈ రోజు మొత్తం దేశం తరపున మన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్‌కు నా హృదయపూర్వక నివాళులు అర్పించాలనుకుంటున్నాను.’’ అని అమిత్ షా పేర్కొన్నారు.