Reading Time: < 1 minute

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ కన్నుమూత

Caption of Image.

చిలుకూరు బాలాజీ ఆలయం.. ఆ ఆలయానికి ఉన్న విశిష్ఠత అంతా ఇంతా కాదు.. బాలాజీ టెంపుల్ అనేకంటే.. వీసా దేవుడు అని IT పీపుల్ పూజలు చేస్తుంటారు. చిలుకూరు బాలాజీ ఆలయం ఎంత ఫేమస్సో.. అదే స్థాయిలో ఆ ఆలయం ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ సైతం అందరికీ ఎంతో సుమరిచితులు. ఆలయంకు వెళ్లిన ప్రతి ఒక్కరూ సౌందర్ రాజన్ మాటలు వింటూనే ఉంటారు.. ఇప్పుడు ఆయన చనిపోయారు. 2026, ఫిబ్రవరి 27వ తేదీన సౌందర్ రాజన్ కన్నుమూసినట్లు ఆలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

సౌందర్ రాజన్ వయస్సు 90 ఏళ్లు. చిలుకూరి బాలాజీ ఆలయానికి ఆయన ప్రధాన అర్చకులుగా ఉన్నారు. వృద్దాప్య సమస్యలతో కొంత కాలంగా బాధపడుతున్నారు. వయస్సు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సౌందర్ రాజన్ కన్నుమూసినట్లు ప్రకటించారు ఆయన కుటుంబ సభ్యులు. 

ALSO READ : కుంభరాశిలో 5 శక్తివంతమైన గ్రహాలు..

చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వెళ్లే ప్రతి ఒక్కరికీ సౌందర్ రాజన్ మాటలు గుర్తు ఉండి ఉంటాయి.. కళ్లు తెరిచి స్వామివారిని చూడండి.. కళ్లు మూసుకుని కాదు.. స్వామి వారిని ప్రశాంతంగా.. నిదానంగా చూడండి.. స్వామిని కళ్లారా చూడండి.. తనివితీరా మొక్కండి అంటూ నిత్యం ఆలయంలో ఆయన మాటలు వినిపిస్తూనే ఉంటాయి. భక్తులతో మమైకం అయ్యి.. సౌందర్ రాజన్ మాట్లాడే మాటలు అందరికీ ఎంతో ఆసక్తిగా ఉంటాయి. 

చిలుకూరు బాలాజీ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే.. అనుకున్నది అవుతుందని.. వీసా వస్తుందని.. విదేశీ ప్రయాణం ఖాయం అనే నమ్మకం ఉంది. అనుకున్నది జరిగిన తర్వాత.. 108 ప్రదక్షిణలు చేస్తుంటారు భక్తులు.

©️ VIL Media Pvt Ltd.