Reading Time: < 1 minute
Dgca Modified Ticket Refund Rules 48 Hour Free Cancellation Deadline For Airlines

Air ticket refund rules: విమాన ప్రయాణికులుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గుడ్ న్యూస్ చెప్పింది. విమాన టికెట్ క్యాన్సలేషన్ రూల్స్‌ను సవరించింది. టికెట్ రీఫండ్, మార్పులకు సంబంధించి ఈ రూల్స్ ఎయిర్ ఫ్లైయర్స్‌కు ఎంతో ఊరటనివ్వనున్నాయి. విమాన ప్రయాణీకులు ఇప్పుడు టికెట్ బుకింగ్ చేసిన 48 గంటలలోపు అదనపు ఛార్జీలు చెల్లించకుండా వారి టిక్కెట్లను రద్దు చేసుకోవచ్చు లేదా సవరించవచ్చు.

Read Also: India vs Zimbabwe: టీమిండియా కథ మార్చబోతున్న మ్యాచ్.. ఒక్క ఓటమితో ఆ నలుగురి కెరీర్స్ క్లోజ్!

బుకింగ్ చేసిన 24 గంటల్లోపు ఏదైనా తప్పు జరిగితే, ప్రయాణికుడు తన పేరును సరిదిద్దుకోవడానికి విమానయాన సంస్థకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఈ సౌకర్యం విమానయాన సంస్థ వెబ్‌సైట్ నుంచి నేరుగా టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఒక వేళ ప్రయాణికుడు ట్రావెట్ ఏజెంట్ లేదా మేక్‌మై ట్రిప్, ఈజీమైట్రిప్ వంటి థర్డ్ పార్టీ పోర్టల్స్ ద్వారా బుక్ చేసుకున్నా, రీఫండ్ ఇచ్చే బాధ్యత విమాన సంస్థలదే అని, ఎందుకంటే వీరు విమానయాన సంస్థ ప్రతినిధులుగా పనిచేస్తున్నారని డీజీసీఏ కొత్త రూల్స్‌లో పేర్కొంది. ఈ రీఫండ్ 14 వర్కింగ్ డేస్‌లో పూర్తి చేయాలని చెప్పింది. ఇదే కాకుండా మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో టికెట్ క్యాన్సలేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది.

గతేడాది డిసెంబర్ 2025లో ఇండిగో విమాన సంక్షోభ సమయంలో చాలా మంది ప్రయాణికులు రీఫండ్ సమస్యల్ని ప్రయాణికులు లేవనెత్తారు. రీఫండ్ ప్రక్రియను మరింత ప్రయాణీకులకు అనుకూలంగా మార్చడం, విమానయాన సంస్థల తరపున జవాబుదారీతనం పెరిగేలా చేయడానికి డీజీసీఏ ఈ కొత్త నిర్ణయాలను ప్రకటించింది.