Reading Time: < 1 minute
200mp Camera War Begins Oppo Find X9 Ultra And Vivo X300 Ultra Set For March Launch

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కెమెరా టెక్నాలజీ పోటీ మరింత ఉన్నత దశలోకి అడుగుపెడుతోంది. తాజా లీక్స్ ప్రకారం.. చైనా టెక్ దిగ్గజాలు ఒప్పో, వివో తమ తదుపరి అల్ట్రా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్ ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా, వివో ఎక్స్300 అల్ట్రాలను మార్చి నెలలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ రెండు డివైస్‌లు భారీ 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్లతో రానున్నాయని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

లీక్ వివరాల ప్రకారం.. ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా, వివో ఎక్స్300 అల్ట్రా ఫోన్లు ఫోటోగ్రఫీ సామర్థ్యాల్లో కొత్త ప్రమాణాలు సెట్ చేయనున్నాయి. ముఖ్యంగా నెక్స్ట్-లెవల్ జూమ్ సామర్థ్యం, హై డీటెయిల్ ఇమేజ్ ప్రాసెసింగ్, లో-లైట్ ఫోటోగ్రఫీ మెరుగుదల వంటి ఫీచర్లపై కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో కెమెరా పనితీరు కీలక ప్రమాణంగా మారిన నేపథ్యంలో ఈ లాంచ్‌లు మార్కెట్ పోటీని మరింత పెంచే అవకాశముంది.

Also Read: OnePlus 15T Launch: హైఎండ్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. డ్రీమ్ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌గా ‘వన్‌ప్లస్ 15టీ’!

ప్రముఖ చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Weiboలో ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా, వివో ఎక్స్300 అల్ట్రా లీక్స్ బయటికి రావడంతో టెక్ ప్రపంచం మొత్తం ఈ వార్తపై దృష్టి సారించింది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా.. ఈ లీక్స్ నిజమైతే 2026లో కెమెరా ఫోన్ పోటీ కొత్త స్థాయికి చేరడం ఖాయం అని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి భారీ మెగాపిక్సెల్ సెన్సర్లు, అడ్వాన్స్‌డ్ జూమ్ టెక్నాలజీ, ప్రీమియం హార్డ్‌వేర్‌తో వచ్చే ఈ అల్ట్రా ఫ్లాగ్‌షిప్ ఫోన్లు మొబైల్ ఫోటోగ్రఫీ ప్రపంచాన్ని మరోసారి మార్చే అవకాశముంది.