Reading Time: < 1 minute

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్- ఇండియా మూవీ ఎస్‌వైజి (సంబరాల ఏటిగట్టు)తో ఇంతకు ముందెన్నడూ చూడని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్- ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం నెక్స్ లెవెల్‌లో రూపొందుతోంది. టీం ప్రస్తుతం భారీ, హై-ఆక్టేన్ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. మేకర్స్ క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా 20 కోట్లకు పైగా కేటాయించారు. 35 రోజుల షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో 18 భారీ యాక్షన్ బ్లాక్‌లు ఉన్నాయి. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ కెవిన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. యుద్ధభూమిని తలపించేలా రూపొందించిన క్లైమాక్స్ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం గుర్తు చేసేలా ఉండబోతుంది. ప్రేక్షకులకు విజువల్‌గా గ్రాండియర్ అనుభూతిని అందించేలా ఈ క్లైమాక్స్‌ను మలిచారు. సాయి దుర్గా తేజ్ ఈ చిత్రంలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ పాన్- ఇండియా విడుదలకు సిద్ధమవుతున్న సంబరాల ఏటిగట్టు ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్‌గా నిలుస్తోంది.