Reading Time: < 1 minute

తిరుమలలో భక్తుల రద్దీ..స్వామి దర్శనానికి 20 గంటల సమయం.. టైమ్ స్లాట్ దర్శనానికి 8 గంటలు..

Caption of Image.

తిరుమల క్షేత్రం కిటకిటలాడుతోంది.  వెంకన్న కొండకు కు భక్తులు పోటెత్తారు. ఏడు కొండల వాడా.. వెంకట రమణా గోవిందా.. గోవింద అనే  నామస్మరణతో మారుమోగుతోంది.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. దీంతో ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ SSD దర్శనానికి 8 గంటల సమయం… 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 5 గంటల సమయం పడుతుంది. 

 గురువారం తిరుమల శ్రీవారిని 62వేల 074 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27వేల784 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.21 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.