Reading Time: 2 minutes
Rashmika Mandanna Announces Marriage With Vijay Deverakonda Virosh Wedding

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొన్నాళ్లుగా వీరి ప్రేమ, పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా ఈ జంట ఏడడుగులు వేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా తెలుగు,కొడవ సంప్రదాయాల ప్రకారం ఈ వివాహ వేడుకలు పూర్తయ్యాయి. రష్మిక షేర్ చేసిన ఫోటోలో ఈ జంట రాజసం ఉట్టిపడేలా కనిపిస్తోంది. అయితే.. పెళ్లి వేడుక ముగిసిన వెంటనే రష్మిక తన సోషల్ మీడియా వేదికగా భర్త విజయ్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, ఒక హృదయపూర్వకమైన సందేశాన్ని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

Also Read:Toxic : రన్ టైం విషయంలో ‘ధురంధర్ 2’ తో పోటీ పడుతున్న ‘టాక్సిక్’..

రష్మిక తన పోస్ట్‌లో విజయ్ దేవరకొండను తన భర్తగా పరిచయం చేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.. ‘నా ప్రియమైన వారికి.. నా భర్త విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నాను. నిజమైన ప్రేమ అంటే ఏంటో నాకు నేర్పించిన వ్యక్తి.. ప్రశాంతంగా ఉండటం అంటే ఎలా ఉంటుందో చూపించిన మనిషి.. పెద్ద కలలు కనడం తప్పు కాదని నాకు ప్రతిరోజూ చెబుతూ, నా కలలను నిజం చేసుకోవడానికి నాకు తోడుగా నిలిచిన నా సర్వస్వం అతడు’ అంటూ రష్మిక రాసుకొచ్చారు. ‘గీత గోవిందం’ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం, ‘డియర్ కామ్రేడ్’తో బలపడి.. నేడు నిజ జీవితంలో ఒక్కటవ్వడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో #ViroshWedding అనే హ్యాష్ ట్యాగ్ ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌లో ఉంది.