Reading Time: < 1 minute
Pm Modi Israel Visit Addressing Knesset Historic Trip

PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ చేరుకున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. సాధారణంగా దేశాధినేతలు వచ్చినప్పుడు ఉండే ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన భార్య సారాతో కలిసి స్వయంగా విమానాశ్రయానికి వచ్చి భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలో ప్రధాని మోడీకి గార్డ్ ఆఫ్ హానర్ లభించింది.

READ ALSO: El Choro: డ్రగ్ డాన్ ఖతం.. ఇప్పుడు ఆ గ్యాంగ్‌కు కొత్త బాస్ ఎవరో తెలుసా?

తొమ్మిదేళ్ల తర్వాత మొదటిసారి..
ప్రధాని మోడీ చివరిసారిగా 2017లో ఇజ్రాయెల్‌ను సందర్శించారు. మళ్లీ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆయన ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. ఇజ్రాయెల్ పార్లమెంటును (నెస్సెట్) ఉద్దేశించి ప్రసంగించబోతున్న తొలి భారత ప్రధానమంత్రిగా మోడీ చరిత్ర సృష్టించనున్నారు. మోడీ ఈ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ను కూడా కలుస్తారు. అలాగే పవిత్ర నగరమైన జెరూసలేంను సందర్శించనున్నారు. భారత్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన అత్యంత కీలకం కానుందని అధికారులు తెలిపారు. ఈ పర్యటన రెండు దేశాల స్నేహ బంధంలో ఒక కొత్త అధ్యాయంగా నిలవనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

READ ALSO: Most Expensive Cheese: పనికిమాలిన గాడిద కాదు.. లక్షలు కురిపించే గాడిద! కేజీ జున్ను ధర వింటే షాక్ అవుతారు..