Reading Time: < 1 minute
The Jerusalem Post Features Welcome Modi On Front Page

ప్రధాని మోడీ రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటన కోసం బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి టెల్-అవీవ్‌కు బయల్దేరి వెళ్లారు. మరికాసేపట్లో ఇజ్రాయెల్‌లో మోడీ ల్యాండ్ కానున్నారు. ఇదిలా ఉంటే మోడీ ఇజ్రాయెల్ పర్యటన నేపథ్యంలో ఆ దేశ ప్రముఖ మీడియా సంస్థ ది జెరూషలేం పోస్ట్‌‌కు చెందిన వార్తాపత్రిక మొదటి పేజీలో ప్రధాని మోడీపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. హిందీలో నమస్తే.. హిబ్రూలో షాలోమ్ అంటూ హడ్‌లైన్ పెట్టింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కథనంలో మోడీ ఫొటో ప్రధానంగా కనిపించింది. మోడీ చేతులు ఊపుతున్నట్లుగా ఉన్న ఫొటో ప్రచురితం చేశారు. భారత్-ఇజ్రాయెల్ సంబంధాల ఆధారంగా కథనాన్ని రాసింది. ‘‘స్వాగతం మోడీ’’ అని.. అలాగే మరొకటి ‘జెరూషలేంతో భారత్ సంబంధాలు’’ అనే కథనాలు ప్రింట్ చేసింది. అంతేకాకుండా ఇజ్రాయెల్‌కు భారత రాయబారి జేపీ.సింగ్‌కు సంబంధించిన ఇంటర్వ్యూను కూడా వేసింది.

ఇది కూడా చదవండి: Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’పై పాఠ్యాంశమా? 8వ తరగతి పుస్తకంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మేరకు 2017లో ఇజ్రాయెల్‌ను సందర్శించిన మొదటి ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. అనంతరం రెండోసారి బుధవారం పర్యటిస్తున్నారు. నెతన్యాహుతో భేటీ తర్వాత రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలపై ఒప్పందాలు జరగనున్నాయి. అలాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్డోగ్‌ను కూడా కలవనున్నాయి. అంతేకాకుండా ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో కూడా మోడీ ప్రసంగించనున్నారు.

ఇది కూడా చదవండి: Trump: భారత్ టార్గెట్‌గా ట్రంప్ మరో దాడి.. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకాలు విధింపు