Reading Time: < 1 minute
Michael Vaughan Slams Babar Azam Batting Strike Rate Pakistan Super 8 Loss England

Michael Vaughan: పాకిస్థాన్ టీమ్ అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్.. టీమ్‌ ఎంపిక నుంచి ఆట వరకు ఎక్కడ చూసినా తప్పకుండా ఏదో వివాదం ఉండే ఉంటుంది. కాగా.. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్‌ 8లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలై కష్టాల బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ బ్యాటింగ్‌పై విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్ మ్యాచ్‌లో నంబర్-4లో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ 24 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. స్ట్రైక్‌రేట్ కూడా 104కే పరిమితమవ్వడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబర్‌ సెలక్షన్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

READ MORE: Akhilesh: అఖిలేష్ యాదవ్ బిగ్ ప్లాన్.. యూపీ ఎన్నికల కోసం ఐ-ప్యాక్‌తో డీల్

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్ (Michael Vaughan) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పాకిస్థాన్ జట్టులో బాబర్ స్థానానికి సంబంధించిన నిర్ణయాల్లో రాజకీయాలు ఉండొచ్చన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఈ పరిస్థితిని హ్యాండిల్ చేస్తున్న హెడ్ కోచ్ మైక్ హెస్సన్ (Mike Hesson) తీరును ప్రశంసించారు. వాఘన్ ప్రకారం.. బాబర్‌ను పూర్తిగా డ్రాప్ చేయడం కష్టం. ఇన్సూరెన్స్‌ పాలసీలా నంబర్ 4లో ఉపయోగిస్తున్నారట. అంటే టాప్ ఆర్డర్ త్వరగా ఔటైతే క్రీజులో నిలబడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యత బాబర్‌పై ఉంటోందన్నమాట. అయితే ఈ వ్యూహం రాజకీయంగా సరైన నిర్ణయం కావొచ్చు గానీ, వరల్డ్‌కప్ గెలవడానికి మాత్రం ఇది బెస్ట్ కాంబినేషన్ కాదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. బాబర్‌కు వరుసగా రెండో టీ20 వరల్డ్‌కప్‌లోనూ నిరాశే ఎదురైంది. 2024 టోర్నీలో అతని స్ట్రైక్‌రేట్ కేవలం 101 ఉండగా, పాకిస్థాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈసారి సైతం బాబర్ సగటు 22.75 మాత్రమే ఉండటం, స్ట్రైక్‌రేట్ 112 వద్ద ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న బాబర్ నుంచి అభిమానులు ఆశించే స్థాయి ప్రదర్శన మాత్రం కనిపించడం లేదు.

READ MORE: Komali Suicide: ప్రేమ, వేదన, ఎదురు చూపులు.. కన్నీళ్లు పెట్టించే యూట్యూబర్ కోమలి సూసైడ్ నోట్‌..