Reading Time: < 1 minute

కవితకు కోర్టులో న్యాయం జరిగింది: కేసులో క్లీన్ చిట్ పై కేటీఆర్ ట్వీట్

Caption of Image.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కిండ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కవితకు న్యాయం జరిగిందని శుక్రవారం (ఫిబ్రవరి 27) ట్వీట్ చేశారు. అదే విధంగా తమ పార్టీ నాయకులపై నమోదైన ప్రతి కేసు రాజకీయ ప్రేరేపితమైన తప్పుడు కేసులని త్వరలోనే తేలిపోతుందని పేర్కొన్నారు.

మద్యం కుంభకోణం అనే సాకుతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ (AAP) ప్రభుత్వాన్ని కూల్చారు. ఆ కేసు వల్ల అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా బీఆర్ఎస్ నష్టపోయింది. సత్యం గెలిచే వరకు, కాంగ్రెస్,  బీజేపీలు చేసే బాధ్యతారహితమైన ఆరోపణలను మనం చూస్తూ వస్తున్నాం. అసత్య పూరిత, కుట్రపూరిత కేసులను, ఆరోపణలను మీడియా ద్వారా ప్రచారం చేసి.. మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు.

దురదృష్టవశాత్తూ, సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యతనిస్తూ, న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ ‘న్యూ ఇండియా’లో అలవాటుగా మారిపోయింది. కానీ చివరికి, న్యాయమే గెలుస్తుంది.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

ALSO READ : చెన్నూర్ మున్సిపల్ ఛైర్మన్ బాధ్యతల స్వీకరణలో మంత్రి వివేక్

©️ VIL Media Pvt Ltd.