Reading Time: < 1 minute
Young Man Young Womandaughter Love Yadadri Bhuvanagiri Telangana

యాదాద్రి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కూతురిని ప్రేమ వివాహం చేసుకున్ను యువకుడి పై కత్తితో దాడికి పాల్పడ్డారు యువతి కుటుంబ సభ్యులు. బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అజయ్ కుమార్, లావణ్య ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కులాలు వేరు కావడంతో పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేశారు యువతి కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం లావణ్య ను ప్రేమ వివాహం చేసుకున్నాడు అజయ్ కుమార్.

Also Read:Rinku Singh Father Dead: రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం!

ఈ పెళ్లి ఇష్టం లేని కుటుంబ సభ్యులు కూతురికి నచ్చజెప్పి రామలింగంపల్లికి తీసుకువచ్చారు. బుధవారం యువతి మొబైల్ నుండి రామలింగంపల్లికి రావాలంటూ అజయ్‌కి మెసేజ్ చేశాడు యువతి సోదరుడు. తనను తన ప్రియురాలే పిలిచిందని అజయ్ వెళ్లాడు. రామలింగంపల్లి గ్రామ శివార్లలోకి రాగానే అజయ్‌ పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. అజయ్ కల్లలో కారం చల్లి కత్తులతో దాడి చేశారు యువతి సోదరుడు, అతని స్నేహితులు. అజయ్ పై 14 సార్లు కత్తితో దాడికి పాల్పడ్డారు.

Also Read:Varanasi : ‘వారణాసి’ మేకింగ్ వీడియో.. రాజమౌళి విజన్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

అపాస్మరక స్థితిలో పడిపోవడంతో అజయ్ చనిపోయాడని భావించి అక్కడి నుండి వెళ్ళిపోయారు యువతి సోదరుడు, స్నేహితులు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అజయ్ ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అజయ్. అజయ్ పై దాడికి పాల్పడిన 8 మందిని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.