Reading Time: < 1 minute

NCERT పుస్తక వివాదం..8వ తరగతి బుక్ బ్యాన్ , డైరెక్టర్ కు నోటీసులిచ్చిన సుప్రీంకోర్టు

Caption of Image.

NCERT బుక్ వివాదంపై  సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. NCERT ప్రచురించిన 8వ తరగతి సోషల్ సైన్స్ బుక్ ప్రచురణ, అమ్మకాలను నిషేధించింది. న్యాయవ్యవస్థను అపహాస్యం చేసేలా  పుస్తకంలో సెలబస్ పెట్టడంపై వివరణ ఇవ్వాలని  కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ,NCERT డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీకి నోటీసులు  జారీ చేసింది. 

వివాదాస్పద అధ్యాయానికి కేంద్రం క్షమాపణలు చెప్పి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ఈ కేసు విచారణను నిలిపివేసేందుకు  సుప్రీంకోర్టు నిరాకరించింది. విద్యా మండలి చీఫ్‌పై ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్  విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం  విచారణను కొనసాగించింది. NCERT పై పూర్తి నిషేధం విధించింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తే న్యాయపాలన ప్రత్యక్షం జోక్యంగా భావించి  కోర్టు ధిక్కారం కేసు కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

►ALSO READ | మీ దేశ బడ్జెట్ కంటే మా కాశ్మీర్ బడ్జెట్టే ఎక్కువ!: పాకిస్తాన్‌పై భారత్ నిప్పులు….

ఈ పుస్తకం రాయడంలో  ప్రమేయం ఉన్న డెవలప్ మెంట్ సభ్యుల పేర్తు, అర్హతలు సహా న్యాయవ్యవస్థపై అధ్యాయాన్ని  ఆమోదించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కమిటీ కి సంబంధించిన రికార్డులను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

NCERT గతంలో ఈ వివాదంపై క్షమాపణలు చెప్పింది.  న్యాయఅవినీతిపై ప్రస్తావించడం సరికాదని అంగీకరిస్తూ  ఆ సెలబస్ ను సమీక్షించి సవరిస్తామని కోర్టుకు తెలిపింది. కొత్తగా విడుదల చేసిన 8వ తరగతి సాంఘిక సోషల్ సైన్స్ పుస్తకం పంపిణీని విరమించుకుంది. 

©️ VIL Media Pvt Ltd.