Reading Time: < 1 minute
Shoaib Malik Fourth Marriage Rumours With Laiba Khan Heres The Truth Behind The Viral News

Shoaib Malik Fourth Marriage: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా పాకిస్థాన్ నటి లైబ ఖాన్ తో వివాహం చేసుకోబోతున్నారనే వార్త తెగ వైరల్ గా మారింది. దీంతో అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

T20 World Cup 2026: రన్‌ రేట్‌ లైట్..! టీమిండియా సెమీస్‌కు చేరే ఒకే ఒక మార్గం

కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్, ఫ్యాన్ పేజీలు షోయబ్ మాలిక్ త్వరలో లైబా ఖాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ పోస్టులు షేర్ చేశాయి. గతంలో ఇద్దరి పేర్లు గాసిప్‌ల్లో వినిపించిన నేపథ్యంలో ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండానే ఈ వార్త పెళ్లి రూమర్లుగా మారింది. అయితే వైరల్ అయిన ఈ వార్త పూర్తిగా అసత్యమని తేలింది. షోయబ్ మాలిక్ మరో పెళ్లికి సిద్ధమవుతున్నారనే విషయానికి ఎలాంటి అధికారిక ప్రకటన, విశ్వసనీయ సమాచారం లేదా ఆధారాలు లేవు. ఇది కేవలం సోషల్ మీడియాలో వ్యాపించిన నిర్ధారణలేని గాసిప్ మాత్రమే.

Buchi Babu Sana: మెగా హీరో తర్వాత అక్కినేని హీరోతో బుచ్చిబాబు సినిమా!

ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. లైబా ఖాన్ ఇప్పటికే 2026 జనవరిలో మదీనాలో వ్యాపారవేత్త జవాద్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె తన పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో షోయబ్ మాలిక్‌తో ఆమె వివాహం జరుగుతుందన్న వార్త పూర్తిగా అబద్దం. ప్రస్తుతం షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్ తో వివాహ బంధంలో ఉన్నారు. 2024 ప్రారంభంలో వీరు పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే తమ వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకున్నారు.