Reading Time: < 1 minute

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘సరస్వతి’. ఈ సినిమాలో ప్రియమణి, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 6వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మూవీ టీమ్, అతిథులతో యాంకర్ సుమ చిట్‌చాట్ చేశారు. ఆమె కొన్ని రకాల దోశల పేర్లు ప్రస్తావిస్తుండగా.. ‘చిరంజీవి దోశ’ను గుర్తు చేసుకున్నారు నటి రాధిక శరత్‌కుమార్. ఓసారి చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు ఆయన దోశ వేసి ఇచ్చారని, అది మల్లెపువ్వులా ఉందని పేర్కొన్నారు. అలాంటి దోశ తానెక్కడా తినలేదని చెప్పారు.