Reading Time: < 1 minute

రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వండి : శ్యామ్ మోహన్ అనంతుల

Caption of Image.
  • హైకమాండ్‌‌‌‌కు  శ్యామ్ మోహన్ అనంతుల విజ్ఞప్తి  

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో త్వరలో ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును అధిష్టానం తనకే కేటాయిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యల కమిటీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత శ్యామ్ మోహన్ అనంతుల ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు ఆరు దశాబ్దాలకుపైగా పార్టీకి అందించిన సేవలను హైకమాండ్ గుర్తించి రాజ్యసభ స్థానం కేటాయిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు శనివారం ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, సిద్ధాంత పరిరక్షణకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. 

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌‌‌‌ను కలిసి రాష్ట్రంలోని రాజకీయ అంశాలపై చర్చిస్తానని పేర్కొన్నారు. అలాగే పార్టీ నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్టు వెల్లడించారు. అయితే, రాజ్యసభ అభ్యర్థుల ఆశావహుల జాబితాలో శ్యామ్ మోహన్ అనంతుల పేరు  బలంగా వినిపిస్తున్నది.

©️ VIL Media Pvt Ltd.