Reading Time: < 1 minute

అమరావతి: కన్న తల్లి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కుమారుడు ఇల్లును తగలబెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఒంగోలులో వెంకటరమణమ్మ తన ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తోంది. చిన్నకుమారుడు చెన్నైలో జాబ్ చేస్తుండగా పెద్ద కుమారుడు కిషోర్ బాబు తల్లితో ఉంటూ మాంసం దుకాణం నడుపుతున్నాడు. మంగళవార తెల్లవారుజామున తల్లి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కుమారుడు ఇల్లును తగలబెట్టాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి అతడు పారిపోయాడు. గ్రామస్థులు మంటలను ఆర్పేశాడు. అప్పటికే వెంకటరమణ సజీవదహనమయ్యారు. కిషోర్ బాబు మానసిక స్థితి సరిగా లేదని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.