Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని జూటూరు గ్రామంలో మాజీ ఎంపి జెసి దివాకర్ రెడ్డికి చెందిన చింత చెట్ల తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తొట కాపలాదారులు చెప్పిన వివరాల ప్రకారం….. జెసి దివాకర్ 60 ఎకరాలలో చింత చెట్లను పెంచుతున్నారు. బిందు సేద్యం ద్వారా చింత చెట్లకు నీళ్లు పోసి కాపాడుకుంటున్నాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొటకు నిప్పు పెట్టారు. దీంతో 30 ఎకరాలలో చింత చెట్లు కాలిపోవడంతో పాటు బిందు సేద్యం పరికారాలు కాలి బూడిదగా మారాయి. జెసి దివాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదు లక్షల మేరు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. జెసి దివాకర్ రెడ్డి ప్రత్యర్థి వర్గం వారు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.