
వాషింగ్టన్: ఇరాన్ లోని ఇతర నాయకులు చేయగలిగేది ఏమీ లేదని, అయతుల్లా అలీ ఖమేనీ బాధితులకు న్యాయం చేశామని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఖమేనీ మృతి ఇరాన్ ప్రజలకే కాదు.. అమెరికన్లకు గొప్ప విజయం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశాన్ని స్వాదీనం చేసుకునేందుకు ఇరాన్ ప్రజలకు ఇదే గొప్ప అవకాశం అని.. తమ నిఘా నుండి ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థ నుంచి ఖమేనీ తప్పించుకోలేక పోయారని, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, సైన్యం, పోలీసులు తమతో పోరాడాలనుకోవట్లలేదని, ఇరాన్ సైన్యం తమ నుంచి మద్దతు కోరుకుంటున్నారని ట్రంప్ తెలియజేశారు. ఇరాన్ ప్రజాస్వామ్య వాదులతో సైన్యం, రివల్యూషనరీ గార్డ్స్ కలవాలని, అందరూ కలిసి ఇరాన్ ను గొప్పగా పునర్నిర్మించాలని సూచించారు. శాంతి నెలకొనేవరకు దాడులు కొనసాగుతాయని పేర్కొన్నారు. భారీ స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించిందని, దాడుల ఆలోచన చేయకపోతే ఇరాన్ కే మంచిదని సూచించారు. ఇరాన్ దాడులకు దిగితే మరింత తీవ్రతతో దాడులు చేస్తామని, ఇంతకు ముందెన్నడూ చూడని క్షిపణులతో దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.