
అమరావతి: బార్ నుంచి వాదన సరిగ్గా ఉన్నప్పుడే జడ్జిల నుంచి నాణ్యమైన తీర్పులు ఉంటాయని సుప్రీంకోర్టు సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఒక్క బెంచ్ కే కాదు.. బార్ లోని లాయర్లు కూడా లక్ష్యంతో ఉండాలని అన్నారు. దామినేడు వద్ద జిల్లా కోర్టు భవనాల సముదాయానికి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..నాణ్యమైన తీర్పులు ఉంటే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, న్యాయవ్యవస్థ మరింత బలోపేతమవుతోందని తెలియజేశారు. మహిళా న్యాయవాదులకు చక్కని సౌకర్యాలు కొత్త భనంలో ఏర్పాటు చేయాలని, కోర్టు నూతన భవనంలో మెడికల్ సెంటర్ కూడా ఉండాలని అధికారులకు ఆదేశించారు. న్యాయం అందించడంలో నిర్దేశిత గడువు ఉండాలని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు.