Reading Time: < 1 minute

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే అరవింద్ కుమార్‌ను ప్రాసికూట్ క్యూట్ చేయడానికి కేంద్రం అనుమతించింది. అరవింద్ కుమార్ పై ఈ కార్ రేస్ కు సంబంధించి అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం సస్పెండ్ చేసినట్టుగా సమాచారం. విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెండ్ కొనసాగనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో క్రిమినల్ కేసు నమోదు కాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును ఏసిబి దర్యాప్తు చేస్తోంది. రెండు రోజుల క్రితం ప్రభుత్వం చేసిన ఐఏఎస్‌ల బదిలీల్లో అరవింద్ కుమార్‌ను ప్రభుత్వం వెయిటింగ్ లో ఉంచింది. అరవింద్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన తర్వాత ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసింది.