Reading Time: < 1 minute

పల్లెకలె: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సెమీ ఫైనల్‌కి అర్హత కోల్పోయిన శ్రీలంక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. లేకపోతే న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుతుంది. అది కూడా కనీసం 160 పరుగులు చేసి.. కనీసం 65 పరుగుల తేడాతో పాక్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. కాగా, ఈ మ్యాచ్‌ పాక్ మూడు మార్పులు చేసింది. బాబర్ ఆజామ్, సైమ్ అయుబ్, సల్మాన్ మీర్జాల స్థానంలో నజీం షా, ఖజ్వా నఫే, అబ్రార్ అహ్మద్‌లను జట్టులోకి తీసుకుంది. శ్రీలంక రెండు మార్పులు చేసింది. కుషల్ మెండీస్, దసున్ హేమంతల స్థానంలో కమిల్ మిషారా, జనిత్‌లు జట్టులోకి వచ్చారు.

తుది జట్లు:

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషారా(కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ శనక(కెప్టెన్), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక.

పాకిస్థాన్: షాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), ఖవాజా నఫే, ఉస్మాన్ ఖాన్(కీపర్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.