
మావోయిస్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అర్బన్ నక్సల్స్‌ను కమిటీల్లో వేస్తున్నారని, లొంగిపోయిన మాజీలను ప్రోత్సహిస్తున్నారని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ విధానం అవలంబిస్తున్నారు. లొంగి పోయిన మావోయిస్టులను పిలిచి ప్రోత్సహిస్తున్నారని, మరోవైపు అర్బన్ నక్సలైట్ భావజాలమున్న వాళ్లను కమిటీలు, కమిషన్లలో వేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అర్బన్ నక్సలైట్ ఆధ్వర్యంలో వేసిన కమిషన్ కు విలువేముందని ఆయన ప్రశ్నించారు. విద్యా రంగం అభ్యున్నతి కోసం సిఫారసులు చేయకుండా ఉపాధ్యాయుల జీతాలను తగ్గించాలని చెబుతున్న విద్యా కమిషన్ రిపోర్టును చెత్త బుట్టలో వేయాలని, లేకపోతే మూసీలో పడేయాలని, రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తులకే నైతికత లేదని ఆయన విమర్శించారు. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఏసీ గదుల్లో కూర్చుని రూపొందించిన నివేదిక అని ఆయన అన్నారు. ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బ తీసి అవమానించడమే అవుతుంది ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు ఏకం కావాలని.
ఉపాధ్యాయులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఉపాధ్యాయుల జీతాలను తగ్గించాలని చెప్పడం సిగ్గు చేటని ఆయన అన్నారు. విద్యావేత్తలు లేని విద్యా కమిషన్ ఇదని ఆయన విమర్శించారు. విద్యా శాఖకు మంత్రి లేరనే విషయాన్ని కూడా గుర్తించని కమిషన్ ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. చాక్ పీసులకు పైసల్లేక, స్కావెంజర్లు లేక స్కూళ్లు అల్లాడుతుంటే పరిష్కార మార్గాలు చూపడం లేదని ఆయన దుయ్యబట్టారు. కనీస ఉత్తీర్ణత మార్కులను 35 నుండి 45కు పెంచడం దుర్మార్గం అని, పేద విద్యార్థులు స్కూల్ స్థాయిలోనే ఫెయిలై ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకోకుండా రూపొందించిన ఏకపక్ష నివేదిక ఇది అని ఆయన విమర్శించారు. ఇండ్ల కూల్చివేతలో రేవంత్ రెడ్డికి గిన్నిస్ రికార్డు ఖాయం అని ఆయన అన్నారు. కూల్చి వేతల ప్రభుత్వం అని ఇండ్లు కూలుస్తున్నారని. గుడులను కూలుస్తున్నారని, ఇదేవిదంగా చేసే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తారని ఆయన హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడి ప్రభుత్వం 4 కోట్ల ఇండ్లను కట్టించి ముందుంటే, కాంగ్రెస్ కూల్చివేతల్లో ముందుంది ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.