
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి భారీ ప్రాణనష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంతో గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.
కాగా, వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకొని 23 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 70 మంది వరకూ ఆ తయారీ కేంద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు.