Reading Time: < 1 minute

ముంబై: సీనియర్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, అందుకే ఈ ఐపిఎల్ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేక పోతున్నాడని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాప్ డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో బుమ్రా ఇప్పటి వరకు ఒక్క వికెట్ తీయలేక పోయిన సంగతి తెలిసిందే. దీంతో అతనిపై విమర్శలు వెత్తుతున్నాయి. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బుమ్రా వేసిన తొలి బంతికే కళ్లు చెదిరే సిక్సర్ కొట్టిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి బుమ్రా ఎంత ఒత్తిడిలో ఉన్నాడో అర్థమవుతుందన్నాడు. ఇక ముంబై కూడా బుమ్రాపై ఎక్కువగా ఆధారపడ కూడదన్నాడు. కీలకమైన మ్యాచుల్లో మాత్రమే అతన్ని ఆడించాలన్నాడు. అప్పుడే అతను ఎలాంటి ఒత్తిడి లేకుండా తన సహాజసిద్ధ బౌలింగ్‌ను చేసే అవకాశం ఉంటుందని డుప్లెసిస్ పేర్కొన్నాడు.