Reading Time: < 1 minute

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు హర్మోగన్ ప్రాంతంలోని మినాబ్‌లో కనీసం 40 మంది విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయ్యారు. దాడుల క్రమంలో అక్కడి బాలికల పాఠశాలపై కూడా బాంబులు విరుచుకుపడటంతో చిన్నారులు మృతి చెందినట్లు ఇర్నా వార్తా సంస్థ తెలిపింది. ఈ దాడులలో కనీసం 45 మందికి పైగా గాయపడ్డారు. ఈ మినాబ్ నగరంలో ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ సైనిక స్థావరం నెలకొని ఉంది. దీనిని ధ్వంసం చేసేందుకు జరిపిన దాడుల క్రమంలో చిన్నారులు బుగ్గి అయ్యారు. అయితే ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ లేదా అమెరికా సైనిక లేదా అధికార వర్గాలు ఈ ఘటన గురించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ఇరాన్‌పై తమ దాడులను ట్రంప్ ఇప్పుడు తమ అమెరికా ఫస్ట్ నినాదం క్రమంలో సమర్థించుకున్నారు. తాను ఈ స్లోగన్‌తోనే అధికారంలోకి వచ్చానని, భవిష్య తరాలకు ఇక ఎటువంటి పరాయి దేశ ముప్పులు రాకుండా చేసేందుకు తాను ఈ చర్యలకు దిగుతున్నానని తెలిపారు. ఇక తన కంటే ముందు వచ్చిన అధ్యక్షులు ఈ పనిచేయలేకపోయారని మండిపడ్డారు.