Reading Time: < 1 minute
Realme C83 5g Launching March 7 In India With 7000mah Battery 144hz Display And Military Grade Protection

Realme C83 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ (realme) సంస్థ కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ realme C83 5Gను భారత్‌లో మార్చి 7న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలుబడింది. గత ఏడాది వచ్చిన C73 5Gకు ఇది సక్సెసర్‌గా లాంచ్ కానుంది. C సిరీస్‌లో భాగంగా విడుదల కానున్న ఈ ఫోన్, బడ్జెట్ వినియోగదారులకు మంచి ఫీచర్లను అందించనుంది.

Anvesh Lookout Notice: యూట్యూబర్‌ అన్వేష్‌పై లుకౌట్‌ నోటీసులు..!

realme C83 5Gలో ప్రధాన ఆకర్షణ 7000mAh భారీ బ్యాటరీ. ఈ బ్యాటరీ 6 సంవత్సరాల వరకు నమ్మకమైన పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇంకా ఈ ఫోన్ MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో వస్తోంది. అంటే పడిపోయినా లేదా కఠిన పరిస్థితుల్లో కూడా ఫోన్ సురక్షితంగా ఉండేలా రూపొందించారు. అలాగే IP64 రేటింగ్ రక్షణ కూడా లభిస్తుంది. అలాగే ఇందులో 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉండనుంది. ముఖ్యంగా 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్, వీడియో అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది.

200MP Camera War: 200MP కెమెరా వార్ మొదలు.. మార్చిలో భారీ ఫ్లాగ్‌షిప్‌లతో రంగంలోకి రెండు దిగ్గజాలు!

డిజైన్ పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరాలతో వెర్టికల్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. బ్లూమింగ్ పర్పల్, స్ప్రౌటింగ్ గ్రీన్ అనే రెండు ప్రత్యేక కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. realme C83 5G లాంచ్ అనంతరం ఫ్లిప్కార్ట్, రియల్ మీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.