Reading Time: < 1 minute
El Mencho Killed Mexico Drug Cartel Successor El Choro

El Choro: మెక్సికో దేశాన్ని వణికించే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ ముఠా ‘జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్’ (CJNG). దీని నాయకుడు నెమెసియో రూబెన్ ఒసేగురా సెర్వంటెస్ (‘ఎల్ మెన్చో’) ను మెక్సికో సైన్యం ఖతం చేసింది. ఈ వార్తతో దేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజానికి ఇతన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మాఫియా డాన్లలో ఒకడిగా చెబుతారు. ఇతని తలపై అమెరికా ఏకంగా రూ.125 కోట్ల ($15 Million) బహుమతిని ప్రకటించింది. వాస్తవానికి ఎల్ మెన్చో దగ్గర సొంత సైన్యం, రాకెట్ లాంచర్లు, సాయుధ వాహనాలు, అత్యుధునిక తుపాకులు ఉన్నాయని సమాచారం.

READ ALSO: AP Crime: అతనో ప్రభుత్వ ఉద్యోగి.. డ్యూటీ దిగిన తర్వాత దొంగతనాలు..!

ఎల్ మెన్చో చనిపోయాడన్న వార్త తెలియగానే, దేశ వ్యాప్తంగా అతని ముఠా సభ్యులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. వాహనాలను తగులబెట్టడం, తుపాకులతో కాల్పులు జరపడం వంటి చర్యలతో మెక్సికోలోని పలు రాష్ట్రాలు రణరంగంగా మారాయి. ఈ మాఫియా నాయకుడిని మట్టుబెట్టడంలో మెక్సికో సైన్యానికి అమెరికా నిఘా సంస్థలు పెద్ద ఎత్తున సహకరించాయని సమాచారం. అమెరికా ఇచ్చిన సమాచారం వల్లే మెక్సికో సైన్యం ఇతనిని పట్టుకోగలిగింది. అయితే, ఇది మెక్సికో సైన్యం సాధించిన విజయమని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది.

తదుపరి నాయకుడిగా ‘ఎల్ చోరో’..
ఎల్ మెన్చో మరణం తర్వాత ఇప్పుడు ఈ ముఠాను ఎవరు నడిపిస్తారనే చర్చ మొదలైంది. ప్రస్తుతం జూలియో ఆల్బర్టో కాస్టిల్లో రోడ్రిగ్జ్ (‘ఎల్ చోరో’) బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇతను ఎల్ మెన్చోకు అల్లుడు అవుతాడని, అలాగే ఆ ముఠాలో చాలా కాలంగా కీలక సభ్యుడిగా ఉన్నాడు. అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేయడంలో, రసాయనాలను దిగుమతి చేసుకోవడంలో ఇతనిదే ప్రధాన పాత్ర అని చెబుతున్నారు. ఇతనిపై ఇప్పటికే అమెరికా ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది.

READ ALSO: Most Expensive Cheese: పనికిమాలిన గాడిద కాదు.. లక్షలు కురిపించే గాడిద! కేజీ జున్ను ధర వింటే షాక్ అవుతారు..