Reading Time: < 1 minute
Netanyahu Calls Iranian Citizens To Overthrow Regime Operation Rising Lion

Israel: ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇజ్రాయిల్ పై భారీ దాడులు చేస్తోంది. శనివారం అమెరికాతో కలిసి జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. దీంతో ఇరాన్ మధ్యప్రాచ్యం అంతటా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఖతార్, ఒమన్‌లను టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా దుబాయ్, ఖతార్ సిటీ, అబుదాబిలపై మిస్సైల్స్, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.

ఇదిలా ఉంటే, తాజాగా ఇజ్రాయిల్ మరోసారి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఘోరమైన దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌లోని అన్ని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తామని చెప్పారు. ఇదే కాకుండా.. ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టాలని పిలుపునిచ్చారు. ఇరాన్ ప్రజలక వైపు ఇజ్రాయిల్ ఉంటుందని చెప్పారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌‌‌కు అంటుకున్న “ఇరాన్” మంటలు.. యూఎస్ కాల్పుల్లో 12 మంది మృతి..

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణం తర్వాత, ఒక వీడియో సందేశంలో నెతన్యాహూ మాట్లాడుతూ.. ‘‘ఖమేనీని చంపి అధికార మార్పుకు మార్గం సుగమం చేస్తుంది, ఇజ్రాయిల్ దాడులు ఇరాన్ సైనిక, పాలన వ్యవస్థల్ని బలహీనం చేస్తుంది, పౌరులు ‘‘ఉగ్రవాద పాలన’’కు ఎదురుతిరిగే పరిస్థితుల్ని సృష్టిస్తుంది’’ అని అన్నారు. ఇరాన్ ధైర్యవంతులైన ప్రజలు నిరంకుశత్వ గొలుసుల నుంచి తమను తాము విడిపించుకోవడానికి ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు.

ఇది ప్రతీ తరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశమని ఆయన అన్నారు. ఇరానియన్లు లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి పాలన వ్యవస్థను కూల్చివేయాలని నెతన్యాహూ చెప్పారు. పర్షియన్లు, కుర్దులు, అజెరిలు, అహ్వాజీలు, బలూచిలతో సహా అన్ని జాతులు సమూహాలను ఇజ్రాయిల్ ప్రధాని ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ సమయంలో ఇరాన్ నాయకత్వాన్ని తొలగించడం ఇజ్రాయెల్ సైనిక లక్ష్యాలలో భాగమా అని తనను గతంలో అడిగినట్లు నెతన్యాహు చెప్పారు.