Reading Time: < 1 minute
Manchu Vishnu Family Scared In Dubai Due To Missile Attacks Iran Israel Conflict

టాలీవుడ్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు.. ప్రస్తుతం దుబాయ్‌లో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధ సెగలు దుబాయ్‌ను కూడా తాకడంతో, అక్కడ క్షిపణుల దాడులను ఆయన కళ్లారా చూశారు. తన కుటుంబం, ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ భయానక వాతావరణంలో చిక్కుకోవడంపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : Renu Desai: నెటిజన్ల అసభ్య కామెంట్స్‌పై రేణూ దేశాయ్ నిప్పులు!

కుటుంబంతో గడపడానికి దుబాయ్ వెళ్లిన విష్ణుకు అక్కడ ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. యుద్ధ విమానాల గర్జనలు, ఆకాశంలో దూసుకెళ్తున్న క్షిపణులు (Missiles), వాటిని అడ్డుకుంటున్న దృశ్యాలు తనను కలతకు గురిచేశాయని ఆయన తెలిపారు. అలా క్షిపణుల దాడుల వల్ల వచ్చే భారీ శబ్దాలకు తాము ఉన్న ఇల్లు మొత్తం కంపించిపోయిందని, ఈ భీభత్సాన్ని చూసి తన చిన్న కుమార్తె ఐరా తీవ్రంగా భయపడిందని, పిల్లలు ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణంలో పెరగాలని తాను ఆకాంక్షిస్తున్నానని.. ఆయన ఎమోషనల్ పోస్ట్ చేశారు. తమ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న యూఏఈ (UAE) సైన్యానికి ఈ సందర్భంగా విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచం మొత్తం శాంతితో ఉండాలని కోరుకుంటూ,‘హర హర మహాదేవ్’ అంటూ తన సందేశాన్ని ముగించారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న భారతీయులు కూడా అక్కడి ఉద్రిక్తతలతో ఆందోళన చెందుతున్నారు. దీంతొ విష్ణు కుటుంబం క్షేమంగా తిరిగి రావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.