Reading Time: < 1 minute

MBBS సీట్లు ఇప్పిస్తామని చెప్పి రూ.40 లక్షల మోసం.. హైదరాబాద్లో ఇద్దరు అరెస్టు

Caption of Image.

మెడికల్ (MBBS) సీట్లు ఇప్పిస్తామని చెప్పి దాదాపు 40 లక్షల రూపాయలు మోసం చేసిన ఘటన కుత్బుల్లాపూర్, పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 27) మోసానికి పాల్పడిన ఇద్దరు  కేటుగాళ్లను పేట్ బాషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జీడిమెట్ల విలేజ్ లోని ఓ బాధితుని ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు  ఎస్.హెచ్ఓ తెలిపారు.

ఈ కేసులో ఇద్దరు నిందితులు A1)అర్వింద్ రావు(40), న్యూఢిల్లీ, A2) వెంకటరావు(58) హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా నీట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులే టార్గెట్ గా దాదాపు 100 మందిని మోసం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

దాదాపు 2 కోట్ల50 లక్షలకు  పైగా మోసం చేసినట్టు పోలీసుల వెల్లడించారు. నిందితుల నుంచి నకీలీ MBBS  అలాట్మెంట్  లెటర్స్, ఐడీలు, నకీలీ ఒప్పందపత్రాలు, 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.