Reading Time: < 1 minute
Mahesh Babu Ss Rajamouli Varanasi Movie Ramayana Link Annapurna Studios Shoot

టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ #Varanasi (SSMB29) ఇప్పుడు షూటింగ్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా కోసం కేవలం విదేశాల్లోనే కాకుండా, హైదరాబాద్‌లోనే అత్యంత అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్స్, అందులో చిత్రీకరించిన సన్నివేశాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన లీక్ బయటకు వచ్చింది. ఈ చిత్రం ఇండియన్ ఎపిక్ రామాయణంతో బలమైన కనెక్షన్ కలిగి ఉండబోతోందని తెలుస్తోంది.

Also Read: Nikhil : ఓటీటీలోకి నిఖిల్ ఎంట్రీ.. యంగ్ హీరో ప్లానింగ్ మాములుగా లేదుగా!

అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రం కోసం ఒక భారీ మోషన్ పిక్చర్ స్టూడియోను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గని విధంగా, వర్చువల్ ప్రొడక్షన్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి కీలక సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరించారు. అయితే, అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో రామాయణ కాలానికి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట. కథా గమనాన్ని మార్చే ఒక కీలక సన్నివేశం రామాయణ నేపథ్యంతో ముడిపడి ఉంటుందని, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలను బట్టి సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. టెక్నాలజీ పరంగా రాజమౌళి తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే, బాహుబలి, ఆర్ఆర్ఆర్ మించిపోయేలా ఈ విజువల్ వండర్ ఉండబోతోందని స్పష్టమవుతోంది.