Reading Time: < 1 minute

T20 World Cup: చెన్నైలో ఎవరూ తగ్గలే.. ఇండియా వీర బాదుడు: జింబాబ్వే టార్గెట్ 257

Caption of Image.

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రౌండ్‎లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచులో బ్యాటింగ్‏లో టీమిండియా దుమ్మురేపింది. ఫామ్ లేమితో సతమతమవుతోన్న యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (55) అర్ధ సెంచరీతో తిరిగి గాడిన పడగా.. చివర్లో హార్ధిక్ పాండ్య (50), తిలక్ వర్మ (44) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

సంజు శాంసన్ (24), ఇషాన్ కిషన్ (38), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (33) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో  సికిందర్ రజా, మఫాసా, ముజరాబానీ తలో వికెట్ తీశారు. అనంతరం జింబాబ్వే 257 పరుగుల లక్యంతో బరిలోకి దిగింది.

©️ VIL Media Pvt Ltd.