Reading Time: < 1 minute
Buchi Babu Sana Next Movie After Ram Charan Peddi Akhil Akkineni

Buchi Babu Sana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. వృద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రం తర్వాత బుచ్చిబాబు సానా తన నెక్ట్స్ సినిమా అక్కినేని అఖిల్‌తో చేయబోతున్నారని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదే గనుక నిజం అయితే అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

READ ALSO: Iran Conflict: ఇరాన్ సుప్రీం లీడర్ ఆఫీసు లక్ష్యంగా దాడి.. టెహ్రాన్ నడిబొడ్డున భీకర యుద్ధం!

ప్రస్తుతం అఖిల్ అక్కినేని లెనిన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత అఖిల్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ అక్కినేని యంగ్ హీరో లెనిన్‌తో సక్సెస్ కొట్టాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.

READ ALSO: The Paradise: యూట్యూబ్‌లో “ఆయా షేర్” ఊర మాస్ విధ్వంసం..