Reading Time: < 1 minute
Tollywood Senior Heroes Chiranjeevi Balakrishna Nagarjuna And Venkatesh Dominate With Exciting Upcoming Movies

Tollywood Senior Heroes: టాలీవుడ్‌ సీనియర్ హీరోలు మరోసారి తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఏజ్ కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ.. యువ హీరోలకు పోటీగా వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ పిల్లర్స్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు సీనియర్ హీరోలు ఇప్పుడు రెండు వేర్వేరు రూట్లలో ప్రయాణిస్తున్నారు. ఒకవైపు చిరంజీవి, బాలయ్య మాస్ సినిమాలతో దూసుకెళ్తుంటే.. మరోవైపు వెంకటేష్, నాగార్జున ఫ్యామిలీ మరియు క్లాస్ ఎంటర్టైనర్లపై దృష్టి పెట్టారు.

Ragi Daliya Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇంట్లోనే చేసుకోండి ‘రాగి ధలియా’!

మెగాస్టార్ చిరంజీవి “మన వరశంకర ప్రసాద్ గారు’ తో బ్లాక్‌బస్టర్ హిట్‌తో మళ్లీ తన ఫామ్‌ను నిరూపించుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు బాబీతో ఒక ఎమోషనల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. అలాగే తరువాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఫుల్ మాస్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బాలకృష్ణ కూడా తగ్గేదేలే అన్నట్లుగా వరుసగా మాస్ ప్రాజెక్టులు లైన్‌లో పెట్టారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పవర్‌ఫుల్ యాక్షన్ సినిమాతో పాటు, తరువాత హరీష్ శంకర్‌తో మరో మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. దీంతో ఈ ఇద్దరూ మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తమదైన స్టైల్‌లో ముందుకు వెళ్తున్నారు.

Sree Vishnu: ఎవరొచ్చినా సరే ఎంటర్టైన్ చేసి పంపిస్తా..!

మరోవైపు నాగార్జున తన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మాఫియా బ్యాక్‌ డ్రాప్‌ లో రాబోతుందని సమాచారం. ఈ సినిమా తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫ్రాంచైజీలో మూడో భాగం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని 2027 జనవరి 15న సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక వెంకటేష్ తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్‌ పైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే ఫ్యామిలీ కథలతో మంచి విజయాలు సాధించిన ఆయన, ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడితో మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.