Reading Time: < 1 minute
Hyderabad Youtuber Komali Suicide Note Rayadurgam Akhil Reddy Missing Police Probe

Hyderabad: హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటోంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో BSC చదువుతు.. పార్ట్ టైమ్‌లో యూట్యూబ్ వీడియోలు చేస్తుంది. అయితే.. కోమలి అఖిల్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించింది. పలు కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం అఖిల్ అండ్ ఫ్యామిలీ పరారీలో ఉంది. కోమలి ఆత్మహత్యకి ఒకరోజు ముందు కోమలి ఫ్లాట్‌ అఖిల్ వెళ్లి ఆ యువతితో మాట్లాడాడు. తనను ప్రేమించి.. మరో అమ్మాయితో ప్రేమలో ఉండటాన్ని కోమలి జీర్ణించుకోలేక పోయింది.. ఇద్దరు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపించాడు అఖిల్.. ఆత్మహత్యకి ముందు అఖిల్‌కి కోమలి మెసేజ్ చేసింది. ఈ విషయాన్ని తన అక్కకు చెప్పాడు అఖిల్.. అఖిల్ అక్క కోమలి ఫ్లాట్‌కి వెళ్ళి డోర్ కొట్టింది. ఎంతసేపటికీ తీయకపోవడంతో తిరిగి వెళ్లిపోయింది కానీ.. పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.

READ MORE: Claude AI Memes: “అబ్‌సల్యూట్ సినిమా”.. క్లాడ్ కొత్త ప్లగిన్స్‌తో ఏఐ అరాచకం! సోషల్ మీడియాలో తుఫాన్..

ఇదిలా ఉండగా.. కోమలికి ఫ్లాట్‌లో సూసైడ్ లెటర్ లభ్యమైంది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. “నేను ముందుకు సాగడానికి భయపడుతున్నాను.. ఎందుకంటే అతను తిరిగి వస్తే? వదిలేయాలి అని నాకు తెలుసు. అతను నా వాడు కాదు అని తెలుసు.. అతను నాతో ఉండడానికి కూడా ప్రయత్నించడం లేదు అని తెలుసు.. కానీ నా లోపల చిన్న భాగం ఇంకా ఎదురు చూస్తోంది.. ఇంకా ఆశిస్తోంది.. ఒక రోజు అతను నన్నే ఎంచుకుంటాడని నా మనసు ఊహిస్తోంది. అందుకే ముందుకు సాగడం అసాధ్యంగా అనిపిస్తోంది.. ఎందుకంటే నేను చివరికి వెనక్కి తిరిగి నడిచి వెళ్లిన క్షణంలో.. అతను తిరిగి వచ్చి నన్ను వెతికితే..” అని సూసైడ్‌ లెటర్‌లో రాసుకొచ్చింది.

READ MORE: Infinix Note Edge 5G: 6,500mAh బ్యాటరీ, కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP కెమెరా.. ఇన్ఫిక్స్ నోట్ ఎడ్జ్ 5G సేల్ స్టార్ట్