Reading Time: < 1 minute
Leopard Roams In Ghaziabad School

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. ఒక చిరుత పులి పాఠశాలలోకి ప్రవేశించింది. కొద్దిసేపు లోపల తిరిగి బయటకు వెళ్లిపోయింది. ఆ సమయంలో పాఠశాల గదుల్లో విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Trump: నేను లేకుంటే పాక్ ప్రధాని షరీఫ్ చనిపోయేవాడు.. ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

బుధవారం ఉదయం కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్పురంలోని గ్రీన్ ఫీల్డ్ స్కూల్లోకి చిరుతపులి ప్రవేశించినట్లుగా ఆట స్థలంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాలో రికార్డైంది. పాఠశాల సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని సోదాలు చేపట్టారు. పెద్ద ఎత్తున స్థానికులు, తల్లిదండ్రులు గుమిగూడారు. చిరుత పులి కారణంగా విద్యార్థులను పాఠశాలలోకి అధికారులు అనుమతించలేదు. పాఠశాల లోపల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.