Reading Time: < 1 minute

ఖమ్మం డివిజన్ ట్రస్మా గౌరవ సలహాదారుడిగా అప్పారావు నియామకం

Caption of Image.

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం గౌరవ సలహాదారుడిగా శ్రీనివాస్ నగర్ లోని గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్ టీవీ అప్పారావు నియమితులయ్యారు. మంగళవారం ఖమ్మం నగరంలోని న్యూ విక్టరీ స్కూల్ లో ప్రైవేట్ పాఠశాల సంఘం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గౌరవ సలహాదారుగా టీవీ అప్పారావు ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం కాంతారావు, ట్రస్మా రాష్ట్ర నాయకుడు ఐవీ రమణారావు, ఎండీ అజారుద్దీన్, శశిధర్ రెడ్డి, ఖమ్మం డివిజన్ ట్రస్మా అధ్యక్షుడు ఎండీ జాఫర్ మతీన్, సెక్రటరీ సూరిబాబు, ట్రెజరర్ మోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.