Reading Time: < 1 minute

PAK vs ENG: ఇంగ్లాండ్ ఘన విజయం.. సెమీస్ రేస్ పాకిస్తాన్కి కష్టమే?

Caption of Image.

PAK vs ENG: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా పల్లెకెలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఓటమితో పాకిస్తాన్ సెమీ ఫైనల్ కి చేరుకునే అవకాశాలు దాదాపుగా గల్లంతయ్యాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న పాకిస్తాన్ కి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. పాక్ బ్యాటర్లలో సైమ్ ఆయూబ్ (7), ఉస్మాన్ ఖాన్ (9), సల్మాన్ అఘా (5), మొహమ్మద్ నవాజ్ (0), షాహీన్ అఫ్రిది (2)లు దారుణంగా విఫలమయ్యారు. 

మరోవైపు, పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ (63) అర్థ శతకంలో జట్టు స్కోర్ 164 చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బాబర్ ఆజామ్ (25), ఫఖార్ జమాన్ (25), షాదాబ్ ఖాన్ (22) ఫర్వలేదనిపించారు. ఇక 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు మొదట్లో కాస్త తడబడింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఫిలిప్ సాల్ట్ (0), జోస్ బట్లర్ (2), జేకబ్ బెథెల్ (8), టామ్ బాంటన్ (2), జేమీ ఓవర్టిన్ (0) ఐదుగురు కేవలం సింగిల్ డిజిట్ పరుగులకే ఔట్ కాగా, సామ్ కరన్ (16) మరోసారి విఫలం అయ్యారు.  

►ALSO READ | Rinku Singh: తండ్రి హెల్త్ కండిషన్ సిరీయస్.. టీమిండియాను వీడిన రింకు సింగ్  

కాగా చివర్లో ఇంగ్లాండ్ బ్యాటర్ విల్ జాక్స్ ( 28) చెలరేగడంతో మరో రెండు వికెట్లు ఉండగానే ఘన విజయం సాధించింది. అయితే పాకిస్తాన్ బౌలర్లు చివరి వరకు విజయం కోసం తెగ ప్రయత్నం చేసినప్పటికీ గెలుపు ఇంగ్లీష్ జట్టునే వరించింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది చెలరేగి కీలకమైన నాలుగు వికెట్లను తీసుకోగా, ఉస్మాన్ తారిక్, షాదాబ్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

©️ VIL Media Pvt Ltd.