Reading Time: < 1 minute
Delhi Hc Denies Bail Rape Accused Kundali Mismatch Marriage Refusal

High Court: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మహిళతో పెళ్లికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత ‘‘జాతకం’’ కలవడం లేదని చెబితే అత్యాచారం కేసు తప్పదని ఢిల్లీ హైకోర్టు ఓ కేసులో కీలక తీర్పును చెప్పింది. శారీరక సంబంధం పెట్టుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ‘‘కుండలి’’ కలవడం లేదని పెళ్లికి నిరాకరించడం నేరంగా పరిగణించవచ్చని కోర్టు పేర్కొంది.

పెళ్లి చేసుకుంటానని పదే పదే నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఒక మహిళ ఒక వ్యక్తిపై రేప్ కేసు పెట్టింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు నిందితుడికి బెయిల్ నిరాకరించింది. నిందితుడిపై IPC సెక్షన్ 376, BNS సెక్షన్ 69 కింద కేసులు నమోదయ్యాయి.

Read Also: Su-57 fighter Jet: రష్యా Su-57 ఫైటర్ జెట్ కొనుగోలుకు భారత్ ఆసక్తి..

ఈ కేసులో వివరాలను పరిశీలిస్తే.. నిందితుడు బాధితురాలికి పంపిన వాట్సాప్ మెసేజ్‌లో ‘‘మన జాతకాలు కాలిశాయి. పెళ్లికి అడ్డంకులు లేవు. రేపే పెళ్లి చేసుకుందాం’’ అని పేర్కొన్నట్లు కోర్టు గుర్తించింది. దీంతో బాధిత మహిళ నిందితుడు, అతడి కుటుంబంపై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంది. అయితే, మళ్లీ నిందితుడు ‘‘జాతకాలు ’’ కలవడం లేదు, పెళ్లి కుదరదు అని చెప్పడాన్ని కోర్టు గుర్తించింది. నిందితుడు గతంలో చెప్పిన మాటలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించింది.

ఈ కేసుపై న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ.. జాతకాలు కలవడం ముఖ్యమైతే శారీరక సంబంధం ఏర్పడకముందే ఆ విషయాన్ని తేల్చుకోవాలని అన్నారు. ముందే పరిష్కారం అయిన విషయాన్ని మళ్లీ సాకుగా చూపడం కేవలం శారీరక సుఖం కోసమే ‘‘తప్పుడు హామీ’’ ఇచ్చినట్లు అర్థమవుతుందని కోర్టు అభిప్రాయపడింది.