Reading Time: < 1 minute
Telangana: సమ్మర్ స్టార్టింగ్‌లో ఈ వర్షాలేంటి భయ్యా.! హైదరాబాద్‌లో అకాల వర్షాలు.. తాజా రిపోర్ట్

హైదరాబాద్‌లో సమ్మర్ ప్రారంభం కావాల్సిన టైంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా సంభవిస్తోంది. నగరంలోని పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, మీర్‌పేట్, ఎల్‌బీ నగర్, రాజేంద్రనగర్, బాలాపూర్ వద్ద జల్లులు పడ్డాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహదీపట్నం ప్రాంతాల్లో కూడా వర్షం కనిపిస్తోంది. గచ్చిబౌలి, శేరింగంపల్లి, పటాన్‌చెరు వైపు ఉరుములతో కూడిన వానలు కురుశాయి. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణలోని సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి.

రాత్రి కూడా మరో రెండు గంటల పాటు భారీ జల్లులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సమ్మర్ స్టార్టింగ్‌లో ఈ వర్షాలు అసాధారణం కానప్పటికీ, బంగాళాఖాతంలోని లో-ప్రెషర్ సిస్టమ్ వల్ల వాతావరణ మార్పులు తీవ్రమవుతున్నాయి. ప్రీ-మాన్సూన్ షవర్స్‌గా ఇవి పరిగణిస్తున్నారు. ఇవి మే-జూన్‌లో కూడా సాధారణం.