
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో వరుస విజయాలతోదూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. సోమవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది రెండో విజయం కాగా, రాజస్థాన్ తొలి ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ట్రావిస్ హెడ్ (18)లు విఫలమయ్యారు. అయితే కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన ఇషాన్ 44 బంతుల్లోనే 6 సిక్స్‌లు, 8 ఫోర్లతో 91 ప రుగులు చేశాడు. క్లాసెన్ (40), నితీశ్ కుమా ర్ రెడ్డి (28), సలీల్ అరోరా 24 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. ప్రఫుల్, సాకిబ్ నాలుగేసి వికెట్లను పడగొట్టారు.