Reading Time: < 1 minute
Pradeep Ranganathan 25 Crore Remuneration 8 Movies Lineup

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది, ఆ పేరే ప్రదీప్ రంగనాథన్. ‘లవ్ టుడే’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కుర్ర దర్శకుడు కమ్ హీరో, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీగా మారిపోయారు. కేవలం తన నటనతోనే కాకుండా, నేటి తరం యువత నాడిని పట్టుకోవడంలో ఆయన చూపిస్తున్న ప్రతిభ చూసి అగ్ర నిర్మాణ సంస్థలు సైతం ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ డైరీ చూస్తుంటే కళ్లు చెదరడం ఖాయం. ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి సినిమాలతో సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ప్రదీప్ చేతిలో ప్రస్తుతం ఏకంగా 8 సినిమాలు ఉన్నాయనే వార్త సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

Also Read:Ustaad Bhagat Singh: రిస్క్ చేస్తున్న హరీష్ శంకర్

సాధారణంగా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు కథలు చర్చల దశలో ఉంటాయి. కానీ ప్రదీప్ విషయంలో మాత్రం సీన్ వేరేలా ఉంది. అగ్ర దర్శకులు, నిర్మాతలు ఆయన డేట్స్ కోసం వేచి చూస్తున్న పరిస్థితి. డిమాండ్‌ను బట్టి పారితోషికం పెరగడం ఇండస్ట్రీలో సహజమే. ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు తన ఒక్కో సినిమాకు ఏకంగా ₹25 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ₹25 కోట్లు అంటే ఏమాత్రం చిన్న మొత్తం కాదు, కానీ ప్రదీప్‌కు ఉన్న యూత్ ఫాలోయింగ్, ఆయన సినిమాల మినిమమ్ గ్యారంటీ వసూళ్లను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు వెనకాడటం లేదు. డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, ప్రదీప్ దగ్గర మాత్రం ప్రస్తుతం డేట్లు లేవు. వచ్చే రెండేళ్ల వరకు ఆయన షెడ్యూల్ పక్కాగా లాక్ అయిపోయింది.